నేనే వద్దన్నా | I tell you | Sakshi
Sakshi News home page

నేనే వద్దన్నా

May 27 2014 2:37 AM | Updated on Aug 15 2018 2:14 PM

నేనే వద్దన్నా - Sakshi

నేనే వద్దన్నా

కేంద్రంలో మంత్రి పదవి వద్దని నరేంద్ర మోడీకి తానే చెప్పానని మాజీ ముఖ్యమంత్రి, శివమొగ్గ పార్లమెంటు సభ్యుడు యడ్యూరప్ప పేర్కొన్నారు.

  • కేంద్ర మంత్రి పదవిపై యడ్డి
  •  సాక్షి,బెంగళూరు : కేంద్రంలో మంత్రి పదవి వద్దని నరేంద్ర మోడీకి తానే చెప్పానని మాజీ ముఖ్యమంత్రి, శివమొగ్గ పార్లమెంటు సభ్యుడు యడ్యూరప్ప పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులో కేసులు ఉండటం వల్ల నరేంద్ర మోడీ తనకు కేంద్ర మంత్రి మండలిలో స్థానం కల్పించలేదంటూ వెలువడుతున్న వార్తలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు.

    బీజేపీని మరింత బలోపేతం చేయడం కోసమే తాను కేంద్రంలో మంత్రి పదవిని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.  ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులకు కేంద్ర మంత్రి మండలిలో స్థానం దక్కడం సంతోషం కలిగించిందన్నారు. భవిష్యత్‌లో మరింత మందికి మంత్రి మండలిలో స్థానం దక్కునుందని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.
     

Advertisement
 
Advertisement
Advertisement