ఆర్టీవో ఇంటిపై ఏసీబీ దాడులు | ACB Raids on Regional Transport Officer in ongole | Sakshi
Sakshi News home page

ఆర్టీవో ఇంటిపై ఏసీబీ దాడులు

Oct 6 2016 9:50 AM | Updated on Aug 17 2018 12:56 PM

ప్రకాశం జిల్లాలో ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడి చేశారు.

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో అవినీతి నిరోధక శాఖాధికారులు గురువారం మెరుపు దాడి చేశారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఒంగోలు ఆర్టీవో రాంప్రసాద్ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో ఏసీబీ దాడులకు దిగింది. ఒంగోలులోని ఆయన నివాసంతో పాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
 
ఇటీవల ప్రసాద్ తన కార్యాలయంలో హోంగార్డు, ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లకు తెరలేపారు. దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఒంగోలు అపార్టుమెంట్‌లో దొరికిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement