మెద్వేద్‌ అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నీ ఫైనల్లో సాక్షి | Wrestler Sakshi Malik sails into final, Pooja Dhanda to fight for bronze | Sakshi
Sakshi News home page

మెద్వేద్‌ అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నీ ఫైనల్లో సాక్షి

Sep 16 2018 5:11 AM | Updated on Sep 16 2018 5:11 AM

Wrestler Sakshi Malik sails into final, Pooja Dhanda to fight for bronze

రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మలిక్‌ మెద్వేద్‌ అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బెలారస్‌లో శనివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం సెమీఫైనల్లో సాక్షి 6–2తో ఎల్మీరా గంబరోవా (అజర్‌బైజాన్‌)పై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో సాక్షి 7–2తో లైస్‌ న్యూన్స్‌ ఒలివీరా (బ్రెజిల్‌)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మరియానా సస్తిన్‌ (హంగేరి)తో సాక్షి తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement