breaking news
international wrestling
-
వినేశ్ ఫొగాట్‌కు డబ్ల్యూఎఫ్ఐ షోకాజ్
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని అంతర్జాతీయ రెజ్లింగ్ బరిలోకి దిగాలని భావిస్తున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షాక్ ఇచ్చింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం, డోపింగ్ నిబంధనల ఉల్లంఘనవంటి ఆరోపణలతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పైగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పునరాగమనానికి అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం ఆమె పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 26 వరకు వినేశ్ దేశవాళీ పోటీల్లో కూడా బరిలోకి దిగే అవకాశం లేదు. నేటి నుంచి గోండాలో జరిగే జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొని ఆసియా క్రీడల కోసం సన్నద్ధం కావాలని వినేశ్ భావించింది. పారిస్ ఒలింపిక్ క్రీడల సందర్భంగా వినేశ్ ప్రవర్తన ‘రెజ్లింగ్‌కు చెడ్డపేరు తెచ్చింది’ అని డబ్ల్యూఎఫ్ఐ ఆరోపించింది. గతంలో డబ్ల్యూఎఫ్ఐకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వినేశ్...ఇటీవల మరోసారి విమర్శలు చేయడంతోనే ఆమెపై చర్యకు డబ్ల్యూఎఫ్ఐ ఉపక్రమించింది. -
మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో సాక్షి
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బెలారస్లో శనివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం సెమీఫైనల్లో సాక్షి 6–2తో ఎల్మీరా గంబరోవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 7–2తో లైస్ న్యూన్స్ ఒలివీరా (బ్రెజిల్)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మరియానా సస్తిన్ (హంగేరి)తో సాక్షి తలపడుతుంది. -
అమిత్ కుమార్‌కు రజతం
అంతర్జాతీయ రెజ్లింగ్ యవనికపై మరో భారత రెజ్లర్ మెరిశాడు. లండన్ ఒలింపిక్స్‌లో సహచరులు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ మెరిస్తే... వారితో కలిసి సాధన చేసే యువ రెజ్లర్ అమిత్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో ఈ హర్యానా రెజ్లర్ ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. బుడాపెస్ట్ (హంగేరి): అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత యువ రెజ్లర్ అమిత్ కుమార్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో 20 ఏళ్ల అమిత్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ఈ ఆసియా చాంపియన్ అమిత్ 1-2 పాయింట్ల తేడాతో హసన్ ఫర్మాన్ రహీమి (ఇరాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. తొలి రోజున భారత్ నుంచి ముగ్గురు రెజ్లర్లు బరిలోకి దిగగా... అమిత్‌కు పతకం లభించింది. ఇతర రెజ్లర్లు అరుణ్ కుమార్ (66 కేజీలు), సత్యవర్త్ (96 కేజీలు) నిరాశపరిచారు. అరుణ్ తొలి రౌండ్లో ఓడిపోగా... సత్యవర్త్ రెండో రౌండ్లో పరాజయం పాలయ్యాడు. మొత్తం 34 మంది రెజ్లర్లు పాల్గొన్న 55 కేజీల విభాగంలో అమిత్ ఫైనల్ మినహా మిగతా అన్ని రౌండ్స్‌లో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. తొలి రౌండ్లో ఈ హర్యానా రెజ్లర్ 10-2తో యాసుహిరో ఇనాబా (జపాన్)పై గెలుపొందగా... రెండో రౌండ్లో 8-0తో జోహైర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమిత్ 6-0తో ఎంజెల్ ఎస్కొబెడో (అమెరికా)ను చిత్తు చేయగా... సెమీఫైనల్లో 8-0తో సెజార్ అక్గుల్ (టర్కీ)ను ఓడించి ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు. 1967 తర్వాత... తాజా ప్రదర్శనతో అమిత్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఎనిమిదో భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 1967లో బిషంబర్ సింగ్ (57 కేజీలు) తర్వాత ఈ మెగా ఈవెంట్లో రజత పతకం సాధించిన తొలి రెజ్లర్‌గా అమిత్ నిలిచాడు. 2010 ఈవెంట్లో సుశీల్ కుమార్ (66 కేజీలు) స్వర్ణ పతకం సంపాదించగా... 2009 ఈవెంట్లో రమేశ్ కుమార్ (74 కేజీలు), 1961 ఈవెంట్లో ఉదయ్ చంద్ (67 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో 2012 ఈవెంట్లో గీత (55 కేజీలు), బబిత (51 కేజీలు), 2006 ఈవెంట్లో అల్కా తోమర్ (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు.


