వినేశ్‌ ఫొగాట్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ షోకాజ్‌  | Wrestling Federation of India Issues Show Cause Notice to Vinesh Phogat | Sakshi
Sakshi News home page

వినేశ్‌ ఫొగాట్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ షోకాజ్‌ 

May 10 2026 5:49 AM | Updated on May 10 2026 12:53 PM

Wrestling Federation of India Issues Show Cause Notice to Vinesh Phogat

రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని అంతర్జాతీయ రెజ్లింగ్‌ బరిలోకి దిగాలని భావిస్తున్న స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) షాక్‌ ఇచ్చింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం, డోపింగ్‌ నిబంధనల ఉల్లంఘనవంటి ఆరోపణలతో ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పైగా రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత పునరాగమనానికి అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం ఆమె పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

 దీని ప్రకారం ఈ ఏడాది జూన్‌ 26 వరకు వినేశ్‌ దేశవాళీ పోటీల్లో కూడా బరిలోకి దిగే అవకాశం లేదు. నేటి నుంచి గోండాలో జరిగే జాతీయ ఓపెన్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో పాల్గొని ఆసియా క్రీడల కోసం సన్నద్ధం కావాలని వినేశ్‌ భావించింది. పారిస్‌ ఒలింపిక్‌ క్రీడల సందర్భంగా వినేశ్‌ ప్రవర్తన ‘రెజ్లింగ్‌కు చెడ్డపేరు తెచ్చింది’ అని డబ్ల్యూఎఫ్‌ఐ ఆరోపించింది. గతంలో డబ్ల్యూఎఫ్‌ఐకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వినేశ్‌...ఇటీవల మరోసారి విమర్శలు చేయడంతోనే ఆమెపై చర్యకు డబ్ల్యూఎఫ్‌ఐ ఉపక్రమించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement