టైగర్‌ వుడ్స్‌ రికార్డు విజయం | Tiger Woods Ranks Sixth In The World Rankings | Sakshi
Sakshi News home page

టైగర్‌ వుడ్స్‌ రికార్డు విజయం

Oct 29 2019 4:34 AM | Updated on Oct 29 2019 4:34 AM

Tiger Woods Ranks Sixth In The World Rankings - Sakshi

ఇన్‌జాయ్‌ (జపాన్‌): గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌ వుడ్స్‌ అద్భుత కెరీర్‌లో మరో కొత్త ఘనత చేరింది. తాజాగా జోజో చాంపియన్‌షిప్‌లో అతను విజేతగా నిలిచాడు. ఈ గెలుపుతో టైగర్‌ వుడ్స్‌ యూఎస్‌ పీజీఏ టూర్‌ టైటిల్స్‌ సంఖ్య 82కు చేరింది. దీంతో స్యామ్‌ స్నీడ్‌ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్‌ రికార్డును వుడ్స్‌ సమం చేశాడు. కెరీర్‌లో 15 ‘మేజర్‌’ టైటిల్స్‌ సాధించిన ఈ స్టార్‌ తన తొలి టూర్‌ టైటిల్‌ను 20 ఏళ్ల క్రితం గెలవడం విశేషం. తాజా విజయంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా టైగర్‌ వుడ్స్‌ పది నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement