breaking news
sixth rank
-
టైగర్ వుడ్స్ రికార్డు విజయం
ఇన్జాయ్ (జపాన్): గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అద్భుత కెరీర్లో మరో కొత్త ఘనత చేరింది. తాజాగా జోజో చాంపియన్షిప్లో అతను విజేతగా నిలిచాడు. ఈ గెలుపుతో టైగర్ వుడ్స్ యూఎస్ పీజీఏ టూర్ టైటిల్స్ సంఖ్య 82కు చేరింది. దీంతో స్యామ్ స్నీడ్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును వుడ్స్ సమం చేశాడు. కెరీర్లో 15 ‘మేజర్’ టైటిల్స్ సాధించిన ఈ స్టార్ తన తొలి టూర్ టైటిల్ను 20 ఏళ్ల క్రితం గెలవడం విశేషం. తాజా విజయంతో ప్రపంచ ర్యాంకింగ్స్లో కూడా టైగర్ వుడ్స్ పది నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు. -
పులకించిన పున్నవల్లి
ఐసీడబ్ల్యూఏలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన పున్నవల్లి విద్యార్థి పున్నవల్లి(చందర్లపాడు) : మండలంలోని పున్నవల్లి గ్రామానికి చెందిన ఉడత వెంకట సాయికిరణ్ ఐసీడబ్ల్యూఏ ఫైనల్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వెంకట సాయికిరణ్కు అభినందనలు తెలిపారు. వెంకటసాయి కిరణ్ సీఏ–సీపీటీలో జాతియ స్థాయిలో 6వ ర్యాంకు, ఐపీసీసీలో 12వ ర్యాంకు, ఐసీడబ్ల్యూఏ ఫౌండేషన్లో ప్రథమ ర్యాంకు, ఇంటర్లో 5వ ర్యాంకు సాధించాడు. మారుమూల గ్రామానికి చెందిన వెంకట సాయికిరణ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని స్థానిక ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి వంశీ పేర్కొన్నారు.