పులకించిన పున్నవల్లి | punnavalli student got sixth rank | Sakshi
Sakshi News home page

పులకించిన పున్నవల్లి

Aug 24 2016 8:14 PM | Updated on Sep 4 2017 10:43 AM

పులకించిన పున్నవల్లి

పులకించిన పున్నవల్లి

మండలంలోని పున్నవల్లి గ్రామానికి చెందిన ఉడత వెంకట సాయికిరణ్‌ ఐసీడబ్ల్యూఏ ఫైనల్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు.

ఐసీడబ్ల్యూఏలో జాతీయ స్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన పున్నవల్లి విద్యార్థి 
పున్నవల్లి(చందర్లపాడు) :
మండలంలోని పున్నవల్లి గ్రామానికి చెందిన ఉడత వెంకట సాయికిరణ్‌ ఐసీడబ్ల్యూఏ ఫైనల్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వెంకట సాయికిరణ్‌కు అభినందనలు తెలిపారు. వెంకటసాయి కిరణ్‌ సీఏ–సీపీటీలో జాతియ స్థాయిలో 6వ ర్యాంకు, ఐపీసీసీలో 12వ ర్యాంకు, ఐసీడబ్ల్యూఏ ఫౌండేషన్‌లో ప్రథమ ర్యాంకు, ఇంటర్‌లో 5వ ర్యాంకు సాధించాడు. మారుమూల గ్రామానికి చెందిన వెంకట సాయికిరణ్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి అత్యుత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని స్థానిక ఆసరా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి వంశీ పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement