తెలంగాణ అథ్లెట్‌ సాయికిరణ్‌కు స్వర్ణం | Gold for Telangana athlete Saikiran | Sakshi
Sakshi News home page

తెలంగాణ అథ్లెట్‌ సాయికిరణ్‌కు స్వర్ణం

Jun 17 2024 3:04 AM | Updated on Jun 17 2024 3:04 AM

Gold for Telangana athlete Saikiran

దుద్యాల్‌: జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అల్వాల్‌ సాయికిరణ్‌ పురుషుల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం జరిగిన ఈవెంట్‌లో వికారాబాద్‌ జిల్లా దుద్యాల్‌ మండలం హస్నాబాద్‌ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సాయికిరణ్‌ ఇనుప గుండును 18.36 మీటర్ల దూరం విసిరాడు. గచ్చి»ౌలి స్టేడియంలో ‘ద్రోణాచార్య’ అవార్డు గ్రహీత, కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద సాయికిరణ్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement