
టాలీవుడ్ నటుడు సాయికిరణ్ తండ్రి కాబోతున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు. తెలుగులో 'నువ్వే కావాలి', 'ప్రేమించు' సినిమాల్లో నటించిన సాయికిరణ్.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌తో బిజీగా ఉన్నాడు. 'కోయిలమ్మ', 'గుప్పెడంత మనసు' తదితర సీరియల్స్‌తో బుల్లితెరపై మరింత గుర్తింపు పొందాడు. అయితే, గతేడాది డిసెంబర్‌లో తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
సాయికిరణ్, స్రవంతి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో వారి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి కూడా సింగర్‌గా గుర్తింపు పొందాడు. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది. కానీ, కొన్ని మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు.
కొంతకాలం పాటు ఒంటరిగానే ఉన్న సాయికిరణ్. తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. అలా వారిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు వారిద్దరూ శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.