కష్టాల్లో లంకేయులు | sri lanka 47/5 in 18.0 overs | Sakshi
Sakshi News home page

కష్టాల్లో లంకేయులు

Aug 30 2015 12:16 PM | Updated on Sep 3 2017 8:25 AM

కష్టాల్లో లంకేయులు

కష్టాల్లో లంకేయులు

భారత్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక కష్టాల్లో పడింది.

కొలంబో: భారత్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక కష్టాల్లో పడింది. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అధిగమించాలంటే ఇంకా 265 పరుగులు చేయాల్సివుంది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టీమిండియా పేసర్లు లంక బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో లంకేయుల భరతం పట్టారు. పదునైన బౌలింగ్ తో లంచ్ విరామ సమయానికే 5 వికెట్లు పడగొట్టారు. తరంగ(4), సిల్వా(3), కరుణరత్నె(11), చందిమాల్(23), మాథ్యూస్(1) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, స్టువర్ట్ బిన్నీ 2 వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో  టీమిండియా 312 పరుగులకు ఆలౌటైంది.

Advertisement
 
Advertisement
Advertisement