‘అర్జున’కు ధావన్, స్మృతి పేర్లు  | Shikhar Dhawan, Smriti Mandhana nominated for Arjuna Award | Sakshi
Sakshi News home page

‘అర్జున’కు ధావన్, స్మృతి పేర్లు 

Apr 26 2018 1:23 AM | Updated on Aug 20 2018 4:12 PM

Shikhar Dhawan, Smriti Mandhana nominated for Arjuna Award - Sakshi

న్యూఢిల్లీ: ఓపెనర్లు శిఖర్‌ ధావన్, స్మృతి మంధాన పేర్లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అర్జున అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ధావన్‌ ప్రస్తుతం టీమిండియా తరఫున మూడు ఫార్మాట్‌లలో సేవలందిస్తుండగా... స్మృతి ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లలో పరుగుల వరద పారించింది. మరోవైపు లార్డ్స్‌లో మే 31న వెస్టిండీస్, వరల్డ్‌ ఎలెవన్‌ జట్ల మధ్య జరుగనున్న చారిటీ టి20 మ్యాచ్‌ కోసం బీసీసీఐ దినేశ్‌ కార్తీక్, హార్దిక్‌ పాండ్యా పేర్లను పంపింది. వీరిద్దరు వరల్డ్‌ ఎలెవన్‌ తరఫున ఆడనున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement