చెలరేగిన జడేజా | ravindra jadeja takes 13 wickets against Jharkhand | Sakshi
Sakshi News home page

చెలరేగిన జడేజా

Oct 9 2015 7:01 PM | Updated on Sep 3 2017 10:41 AM

చెలరేగిన జడేజా

చెలరేగిన జడేజా

టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు.

రాజ్ కోట్:టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. రంజీల్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా  ఆడిన రెండు మ్యాచ్ ల్లో  24 వికెట్లు నేలకూల్చి జట్టుకు వరుసగా అద్భుతమైన విజయాలను అందించాడు. త్రిపురతో జరిగిన తొలి మ్యాచ్ లో 11 వికెట్లు తీసి సౌరాష్ట్ర గెలుపులో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కించుకున్న జడేజా.. అనంతరం జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో  13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

 

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసిన జడేజా..  రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లతో జార్ఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. దీంతో జార్ఖండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 168 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 122 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం 86 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన సౌరాష్ట్ర కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో  ఆల్ రౌండ్ షో తో ఆకట్టుకున్న జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.  సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో జడేజా(58)హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. జడేజా విశేషంగా రాణించడంతో నాలుగు రోజులు జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది.

 

జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ 168, రెండో ఇన్నింగ్స్ 122

సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్  205, రెండో ఇన్నింగ్స్  86/2 (8వికెట్లతో విజయం)

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement