ఇంగ్లండ్ జోరుకు వరుణుడు బ్రేక్ | Rain stops England's progress, take tea with 85-run lead | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ జోరుకు వరుణుడు బ్రేక్

Aug 8 2014 9:13 PM | Updated on Sep 2 2017 11:35 AM

ఇంగ్లండ్ జోరుకు వరుణుడు బ్రేక్

ఇంగ్లండ్ జోరుకు వరుణుడు బ్రేక్

నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేశాడు. ఆట రెండో రోజు టీ విరామ సమయానికి కుక్ సేన 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది.

మాంచెస్టర్: నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేశాడు. ఆట రెండో రోజు టీ విరామ సమయానికి కుక్ సేన 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో భారత్ పై 85 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.

రూట్ 48, బట్లర్ 22 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. బెల్(58) అర్థ సెంచరీ సాధించాడు. జొర్డాన్ 13, అలీ 13 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఆరోన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 152 పరుగులకు ఆలౌటైంది.

Advertisement
 
Advertisement
Advertisement