దక్షిణ ఆసియా టోర్నీకి భారత బాస్కెట్ బాల్ జట్టు అర్హత | Indian win lift South Asian Basketball Championship | Sakshi
Sakshi News home page

దక్షిణ ఆసియా టోర్నీకి భారత బాస్కెట్ బాల్ జట్టు అర్హత

May 17 2014 3:49 PM | Updated on Sep 2 2017 7:28 AM

బాస్కెట్ బాల్ టోర్నీలో భాగంగా ఇక్కడ మాల్దీవులతో జరిగిన మ్యాచ్ లోభారత్ పురుషల జట్టు విజయం సాధించి దక్షిణ ఆసియా బాస్కెట్ బాల్ చాంఫియన్ కు అర్హత సాధించింది.

కాట్మాండ్: బాస్కెట్ బాల్ టోర్నీలో భాగంగా ఇక్కడ మాల్దీవులతో జరిగిన మ్యాచ్ లోభారత్ పురుషల జట్టు విజయం సాధించి దక్షిణ ఆసియా బాస్కెట్ బాల్ చాంఫియన్ కు అర్హత సాధించింది. భారత్ పురుషుల జట్టు 108- 32 పాయింట్ల తేడాతో మాల్దీవులను మట్టికరిపించింది. ఆట తొలి అర్ధభాగం వరకూ మెల్లగా ఆడుతూ 64-16 తేడాతో పాయింట్లు సాధించిన భారత్.. అనంతరం ఎదురుదాడికి చేసి మాల్దీవులకు చుక్కలు చూపించింది.

 

భారత్ దూకుడు ముందు ప్రత్యర్థి జట్టు విఫలమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ టో్ర్నీలో 4-0 తేడాతో  అప్రతిహత విజయాలు సాధించిన భారత్.. అంతకుముందు కూడా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ పై విజయాలను సాధించింది. దీంతో దక్షిణ ఆసియా తరుపున మొదటి స్థానం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. వచ్చే జూలైలో చైనాలో జరిగే మేటి జట్లతో భారత్ తలపడనుంది.  అక్కడ చైనాతో పాటు ఇరాన్, ఫిలిప్పీన్స్ వంటి పటిష్టమైన జట్లను భారత్ ఎదుర్కొనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement