south asia basketball championship
-
భారత అండర్–18 మహిళల జట్టు కెప్టెన్గా విహా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్వాలిఫయింగ్ అండర్–18 బాస్కెట్ బాల్ టోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టుకు తెలంగాణ అమ్మాయి జొన్నలగడ్డ విహా రెడ్డి నాయకత్వం వహిస్తుంది. ఈ టోర్నీ సోమవారం శ్రీలంక రాజధాని కొలంబోలో మొదలవుతుంది. తెలంగాణకే చెందిన నేత్ర బిరుదవోలు, అదితి సుబ్రమణియన్, ఏంజెలినా జార్జ్, మహెక్ శర్మ, వైష్ణవి పరదేశి జట్టులోని ఇతర సభ్యులుగా ఉన్నారు. పుదుచ్చేరిలో జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ సందర్భంగా టీమిండియాకు భారత బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, తమిళనాడు ప్రభుత్వ క్రీడల మంత్రి ఆధవ్ అర్జున కిట్లు అందజేశారు. ఆసియా కప్ అండర్–18 బాస్కెట్ బాల్ టోర్నీకి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 23 వరకు జరుగుతుంది. -
దక్షిణ ఆసియా టోర్నీకి భారత బాస్కెట్ బాల్ జట్టు అర్హత
కాట్మాండ్: బాస్కెట్ బాల్ టోర్నీలో భాగంగా ఇక్కడ మాల్దీవులతో జరిగిన మ్యాచ్ లోభారత్ పురుషల జట్టు విజయం సాధించి దక్షిణ ఆసియా బాస్కెట్ బాల్ చాంఫియన్ కు అర్హత సాధించింది. భారత్ పురుషుల జట్టు 108- 32 పాయింట్ల తేడాతో మాల్దీవులను మట్టికరిపించింది. ఆట తొలి అర్ధభాగం వరకూ మెల్లగా ఆడుతూ 64-16 తేడాతో పాయింట్లు సాధించిన భారత్.. అనంతరం ఎదురుదాడికి చేసి మాల్దీవులకు చుక్కలు చూపించింది. భారత్ దూకుడు ముందు ప్రత్యర్థి జట్టు విఫలమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ టో్ర్నీలో 4-0 తేడాతో అప్రతిహత విజయాలు సాధించిన భారత్.. అంతకుముందు కూడా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ పై విజయాలను సాధించింది. దీంతో దక్షిణ ఆసియా తరుపున మొదటి స్థానం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. వచ్చే జూలైలో చైనాలో జరిగే మేటి జట్లతో భారత్ తలపడనుంది. అక్కడ చైనాతో పాటు ఇరాన్, ఫిలిప్పీన్స్ వంటి పటిష్టమైన జట్లను భారత్ ఎదుర్కొనుంది.


