భారత అండర్‌–18 మహిళల జట్టు కెప్టెన్‌గా విహా రెడ్డి | Jonnalagadda Viha Reddy captain of Indian Women Under-18 Basketball Team | Sakshi
Sakshi News home page

భారత అండర్‌–18 మహిళల జట్టు కెప్టెన్‌గా విహా రెడ్డి

May 25 2026 6:08 AM | Updated on May 25 2026 6:08 AM

Jonnalagadda Viha Reddy captain of Indian Women Under-18 Basketball Team

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాసియా క్వాలిఫయింగ్‌ అండర్‌–18 బాస్కెట్‌ బాల్‌ టోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టుకు తెలంగాణ అమ్మాయి జొన్నలగడ్డ విహా రెడ్డి నాయకత్వం వహిస్తుంది. ఈ టోర్నీ సోమవారం శ్రీలంక రాజధాని కొలంబోలో మొదలవుతుంది. తెలంగాణకే చెందిన నేత్ర బిరుదవోలు, అదితి సుబ్రమణియన్, ఏంజెలినా జార్జ్, మహెక్‌ శర్మ, వైష్ణవి పరదేశి జట్టులోని ఇతర సభ్యులుగా ఉన్నారు. 

పుదుచ్చేరిలో జాతీయ జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ సందర్భంగా టీమిండియాకు భారత బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, తమిళనాడు ప్రభుత్వ క్రీడల మంత్రి ఆధవ్‌ అర్జున కిట్‌లు అందజేశారు. ఆసియా కప్‌ అండర్‌–18 బాస్కెట్‌ బాల్‌ టోర్నీకి అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 23 వరకు జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement