breaking news
basketball tournament
-
చైనా చేతిలో భారత్ పరాజయం
జిద్దా (సౌదీ అరేబియా): ఆసియా కప్ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 69–100 పాయింట్ల తేడాతో చైనా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. తొలి క్వార్టర్లో భారత్ 14 పాయింట్లు, చైనా 29 పాయింట్లు... రెండో క్వార్టర్లో భారత్ 17 పాయింట్లు, చైనా 24 పాయింట్లు... మూడో క్వార్టర్లో భారత్ 17 పాయింట్లు, చైనా 22 పాయింట్లు... చివరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ 21 పాయింట్లు, చైనా 25 పాయింట్లు స్కోరు చేశాయి. భారత్ తరఫున అరవింద్ ముత్తు కృష్ణన్ 16 పాయింట్లు, సహజ్ సెఖోన్ 14 పాయింట్లు, ప్రణవ్ ప్రిన్స్ 14 పాయింట్లు సాధించారు. చైనా తరఫున మింగ్‌జువాన్ జు, జియాజి జావో 17 పాయింట్ల చొప్పున... షుయెపెంగ్ చెంగ్, జున్‌జీ వాంగ్ 13 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. నాలుగు జట్లను గ్రూప్ ‘సి’లో రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలకు దాదాపుగా తెరపడింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను శనివారం ఆతిథ్య సౌదీ అరేబియాతో ఆడుతుంది. -
Asia Cup: జపాన్ చేతిలో భారత్ పరాజయం
Asia Cup Basketball Tourney: జోర్డాన్‌లో జరుగుతున్న ఆసియా కప్ మహిళల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 46–136 (14–41, 11–25, 14–38, 7–32) పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ చేతిలో ఓడిపోయింది. 10 నిమిషాల చొప్పున నిడివిగల నాలుగు క్వార్టర్స్‌లో ఏ దశలోనూ భారత్ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. భారత్ తరఫున పుష్ప 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. జపాన్ తరఫున మియాషితా 27, మోనికా ఒకోయె 24, హరునో నెమోటో 17 పాయింట్లు స్కోరు చేశారు. చదవండి: Inzamam ul Haq: పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు.. -
ఫైనల్లో విక్టరీ ప్లేగ్రౌండ్
హైదరాబాద్: సి.నర్సిరెడ్డి స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ విక్టరీ ప్లేగ్రౌండ్ (వీపీజీ) జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. అబిడ్స్‌లోని రెడ్డి బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో వీపీజీ 104–73తో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై గెలిచింది. విరామ సమయానికి వీపీజీ 49–39తో ఆధిక్యంలో ఉంది. వీపీజీ జట్టులో ప్రసాద్ 32 పాయింట్లు, నవీన్ 24 పాయింట్లు స్కోరు చేశారు. వైఎంసీఏ జట్టులో సన్నీ 28 పాయింట్లు, క్రిస్ 22 పాయింట్లు సాధించి రాణించారు. -
నేటి నుంచి సౌత్‌జోన్ బాస్కెట్‌బాల్ టోర్నీ
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీలు, 26 నుంచి 29వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఐ.వి.రావు తెలిపారు. యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరీ రాష్ట్రాల నుంచి దాదాపు 46 యూనివర్సిటీల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో నార్త్, సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్, సెంట్రల్జోన్ల నుంచి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన మొత్తం 20 జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో పూల్-ఏ, బీ మ్యాచ్‌లు విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, పూల్-సీ మ్యాచ్‌లు చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల, పూల్-డీ మ్యాచ్‌లు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల(చినవుటుపల్లి) ప్రాంగణాల్లో జరుగుతాయని వివరించారు. క్వార్టర్ ఫైనల్, లీగ్ మ్యాచ్‌లు, ఫైనల్స్ విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల మైదానంలో జరుగుతాయని తెలిపారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ నాకౌట్, ఫైనల్స్ మ్యాచ్‌లు ఈ నెల 28, 29 తేదీల్లో సిద్దార్థ ప్రభుత్వ ైవె ద్య కళాశాల మైదానంలో నిర్వహిస్తామన్నారు. పగలుతో పాటు సాయంత్ర ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. టోర్నీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.కృష్ణమూర్తి, హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు క్యాదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి, తమిళనాడు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.తిరుమలై స్వామి పాల్గొన్నారు. హెల్త్ యూనివర్సిటీ జట్టు ఇదే ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళా బాస్కెట్‌బాల్ టోర్నీలో పాల్గొనే హెల్త్ యూనివర్సిటీ జట్టును శుక్రవారం యూనివర్సిటీ స్పోర్ట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ త్రిమూర్తి విడుదల చేశారు. జట్టులో పి.నిఖిత, కె.శ్రీనైనా, అంకితాసింగ్ తోమర్, వై.ఉర్మిళా(సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల), శృతి ఎస్.నాయర్, ఎ.రమ్య (ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల), వి.ఎన్.వి. వైష్ణవి, ఎం.మానిని(మహారాజా మెడికల్ కళాశాల, విజయనగరం),డి.పద్మప్రియాంక(సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల, ఏలూరు), సిహెచ్.నిఖితచౌదరి (మమతా మెడికల్ కళాశాల, ఖమ్మం), వి.జయశ్రీ(ఆర్మీ డెంటల్ కళాశాల, సికింద్రబాద్), వి.డి.భార్గవి(కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల) హెల్త్ యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టు కోచ్ కె.రాజేంద్రప్రసాద్ (శాయ్ కోచ్), మేనేజర్‌గా డాక్టర్ ఇ.త్రిమూర్తి వ్యవహరిస్తారు. జట్టు సభ్యులను యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఐ.వి.రావు శుభాకాంక్షలు తెలిపారు. -
హోలీ ఫ్యామిలీ స్కూల్ శుభారంభం
ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: డాక్టర్ ఇమాన్యుయెల్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో బాలికల విభాగంలో హోలీ ఫ్యామిలీ హైస్కూల్, ఇండస్ వరల్డ్ స్కూల్ జట్లు శుభారంభం చేశాయి. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్లో బుధవారం జరిగిన లీగ్ పోటీల్లో హోలీ ఫ్యామిలీ హైస్కూల్ జట్టు 10-2తో సెయింట్ మైకేల్ స్కూల్ టీమ్‌పై గెలిచింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 8-0 ఆధిక్యాన్ని సాధించిన హోలీ ఫ్యామిలీ హైస్కూల్ జట్టు ఆ తర్వాత కూడా దూకుడును కొనసాగించింది. వైష్ణవి ఆరు పాయింట్లు సాధించింది. సెయింట్ మైకేల్ స్కూల్ జట్టులో చందన 2 పాయింట్లు చేసింది. మరో మ్యాచ్‌లో ఇండస్ వరల్డ్ స్కూల్ జట్టు 7-4తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచింది. బాలుర విభాగంలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు 24-16 పాయింట్ల్లతో గీతాంజలి స్కూల్ జట్టుపై గెలిచింది. మరో లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టు 28-3తో నాసర్ స్కూల్ జట్టుపై నెగ్గింది.