
జిద్దా (సౌదీ అరేబియా): ఆసియా కప్ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 69–100 పాయింట్ల తేడాతో చైనా జట్టు చేతిలో ఓటమి చవిచూసింది. తొలి క్వార్టర్‌లో భారత్ 14 పాయింట్లు, చైనా 29 పాయింట్లు... రెండో క్వార్టర్‌లో భారత్ 17 పాయింట్లు, చైనా 24 పాయింట్లు... మూడో క్వార్టర్‌లో భారత్ 17 పాయింట్లు, చైనా 22 పాయింట్లు... చివరిదైన నాలుగో క్వార్టర్‌లో భారత్ 21 పాయింట్లు, చైనా 25 పాయింట్లు స్కోరు చేశాయి.
భారత్ తరఫున అరవింద్ ముత్తు కృష్ణన్ 16 పాయింట్లు, సహజ్ సెఖోన్ 14 పాయింట్లు, ప్రణవ్ ప్రిన్స్ 14 పాయింట్లు సాధించారు. చైనా తరఫున మింగ్‌జువాన్ జు, జియాజి జావో 17 పాయింట్ల చొప్పున... షుయెపెంగ్ చెంగ్, జున్‌జీ వాంగ్ 13 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. నాలుగు జట్లను గ్రూప్ ‘సి’లో రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలకు దాదాపుగా తెరపడింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను శనివారం ఆతిథ్య సౌదీ అరేబియాతో ఆడుతుంది.