31న భారత జట్టు ఎంపిక | Indian team for Bangladesh to be picked by end of May | Sakshi
Sakshi News home page

31న భారత జట్టు ఎంపిక

May 22 2014 1:09 AM | Updated on Sep 2 2017 7:39 AM

మూడు వన్డేల స్వల్ప సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న భారతజట్టును ఈ నెల 31న ఎంపిక చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (జూన్ 1న) జరగనున్న బెంగళూరులోనే జట్టు ఎంపిక జరిగే అవకాశాలున్నాయని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.

బంగ్లాదేశ్‌లో మూడు వన్డేల సిరీస్‌కు
 ముంబై: మూడు వన్డేల స్వల్ప సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న భారతజట్టును ఈ నెల 31న ఎంపిక చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (జూన్ 1న) జరగనున్న బెంగళూరులోనే జట్టు ఎంపిక జరిగే అవకాశాలున్నాయని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.

 
 జూన్ 15-19 మధ్య బంగ్లాతో జరగనున్న మూడు వన్డేల్లో తలపడేందుకు టీమిండియా జూన్ 13న బయల్దేరి వెళ్లనుంది. తిరిగి 20న స్వదేశానికి రానున్న భారత జట్టు ఆ వెంటనే ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనకు వెళ్తుంది. బంగ్లాతో మూడు వన్డేల్లో కొందరు కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తామని సంజయ్ పటేల్ ఇంతకుముందు ప్రకటించిన నేపథ్యంలో.. కెప్టెన్ ధోని, కోహ్లిలకు విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement