కోహ్లి మెరుపులు | india set target of 193 runs for west indies | Sakshi
Sakshi News home page

కోహ్లి మెరుపులు

Mar 31 2016 8:39 PM | Updated on Sep 3 2017 8:57 PM

కోహ్లి  మెరుపులు

కోహ్లి మెరుపులు

వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి మెరుపులు మెరిపించాడు.

ముంబై: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి మెరుపులు మెరిపించాడు.  విరాట్ (89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) చెలరేగి ఆడటంతో టీమిండియా 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(43;31 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్సర్లు) దాటిగా ఆడగా, అజింక్యా రహానే(40;35 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద రోహిత్ శర్మ..  బద్రీ బౌలింగ్ లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

 

ఆ తరుణంలో రహానేకు జతకలిసిన కోహ్లి ఆదిలో ఆచితూచి బ్యాటింగ్ చేసినా తరువాత తనదైన మార్కుతో ఆటతో రెచ్చిపోయాడు. అతనికి జతగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(15 నాటౌట్; 9 బంతుల్లో 1 ఫోర్) అండగా నిలవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు నమోదు చేసింది.  విండీస్ బౌలర్లలో రస్సెల్, బద్రిలకు తలో వికెట్ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement