తడబడిన హైదరాబాద్ బౌలర్లు | Hyderabad bowlers are struggled to bowel | Sakshi
Sakshi News home page

తడబడిన హైదరాబాద్ బౌలర్లు

Aug 18 2014 11:45 PM | Updated on Sep 7 2018 2:20 PM

తడబడిన హైదరాబాద్ బౌలర్లు - Sakshi

తడబడిన హైదరాబాద్ బౌలర్లు

బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్‌లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తడబడ్డారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముంబై 100 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ముంబై భారీ స్కోరు 
బుచ్చిబాబు టోర్నీ

 
చెన్నై: బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్‌లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తడబడ్డారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముంబై 100 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బ్యాట్స్‌మెన్ బ్రావిష్ శెట్టి (157), నిఖిల్ పాటిల్ (123) సెంచరీలతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ 121 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...లెఫ్టార్మ్ సీమర్ అన్వర్ ఖాన్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
 
మరో వైపు అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర 100 ఓవర్లలో 365 పరుగులు చేసింది. కె.భరత్ రెడ్డి (96), శ్రీకర్ భరత్ (95) సెంచరీలు చేజార్చుకోగా...జి. చిరంజీవి (66), బోడ సుమంత్ (41) రాణించారు.

Advertisement
 
Advertisement
Advertisement