దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు! | YSRCP MLA Ananta venkatRamireddy Fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు!

Dec 31 2019 2:00 PM | Updated on Dec 31 2019 2:04 PM

YSRCP MLA Ananta venkatRamireddy Fires on Chandrababu Naidu - Sakshi

సాక్షి, అనంతపురం: మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్‌ చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement