‘బుల్‌ బుల్‌ రాజా మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం’

YSRCP Leader Silpa Chakrapani Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు : రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెంట్‌ ఇంచార్జి శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన పాదయాత్ర ఓ చారిత్రక సంచలనం అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్న ఏకైక నాయకుడు వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఎఫెక్ట్‌ చంద్రబాబుపై పడిందన్నారు. నవరత్నాల ప్రకటనతో చంద్రబాబు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రకటించిన రూ.రెండు వేల పెన్షన్‌ కేవలం ఎన్నికల ముగిసే వరకే అందిస్తారనని, అధికారం కోసమే పెన్షన్‌ పెంచారని ఆరోపించారు.

మాటలు సరిగ్గా రాని బుల్‌ బుల్‌ రాజా బాలకృష్ణ కూడా ప్రతిపక్షాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్లు బాలకృష్ణ కుటుంబంలోనే ఉన్నారని విమర్శించారు. (వైరల్‌: బుల్‌బుల్‌ బాలయ్య..!)

తెలంగాణ ప్రజల మాదిరే ఏపీ ప్రజలు కూడా చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసే సమయం దగ్గరలోనే ఉందన్నారు. గతంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన చంద్రబాబు మళ్లీ రాహుల్‌తోనే జతకట్టడం సిగ్గు చేటన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్లు లేనందుకే తాము సమావేశాలకు హాజరుకావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు సాధించి రికార్డు సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top