వైరల్‌: బుల్‌బుల్‌ బాలయ్య..!

Balayya Funny Speech In Bowenpally - Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌ : మహాకూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి నవ్వుల పాలయ్యారు. నగరంలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. హిందీలో మాట్లాడాలని ప్రయత్నించి.. సారేజ‌హాసె అచ్చా పాట‌ను ఖూనీ చేసి న‌వ్వుల‌పాల‌య్యారు. ఈ వీడియోను కేటీఆర్‌ సైతం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే మరో శాంపుల్‌ అని ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బుల్‌బుల్‌ బాలయ్య అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top