కేటీఆర్‌కు షాకిచ్చిన స్వతంత్రులు | The Independent Candidates Win In Sircilla Municipality Elections | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు షాకిచ్చిన స్వతంత్రులు

Jan 25 2020 11:37 AM | Updated on Jan 25 2020 11:44 AM

Ten Indipents Will In Sircilla Municipality Elections - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చేటుసుకున్నాయి. సిరిసిల్లలో పది వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించి.. కేటీఆర్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో విజయం సాధించగా.. బీజేపీ 3, కాంగ్రెస్‌ 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరంతా టీఆర్‌ఎస్‌కు చెందిన రెబల్స్‌గా తెలుస్తొంది. అయితే రెబెల్స్‌ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్‌ఎస్‌లోకి తీసుకునేది లేదని కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (మున్సిపల్‌ ఎన్నికలు : కౌంటింగ్‌ అప్‌డేట్స్‌)

Advertisement
 
Advertisement
Advertisement