నరసరావుపేటలో ఉద్రిక్తత.. | TDP Workers Stopped YSRCP Election Campaign In Narasaraopet | Sakshi
Sakshi News home page

నరసరావుపేటలో ఉద్రిక్తత..

Mar 17 2019 9:54 PM | Updated on Mar 17 2019 9:56 PM

TDP Workers Stopped YSRCP Election Campaign In Narasaraopet - Sakshi

సాక్షి, గుంటూరు:  జిల్లాలోని నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 12వ వార్డులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అయితే ఆయన ప్రచారాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు తమ వార్డులోకి రావద్దంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement