గుంటూరులో గల్లా రౌడీయిజం చేశారు : మోదుగుల | Modugula Venugopala Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

గుంటూరులో గల్లా రౌడీయిజం చేశారు : మోదుగుల

Apr 1 2019 5:10 PM | Updated on Apr 1 2019 5:54 PM

Modugula Venugopala Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న సింగిల్ ఎజెండాతోనే ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 25 ఎంపీలు గెలిపిస్తే ఈ రాష్ట్రానికి కచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తామన్నారు. హోదా వచ్చేంత వరకు పార్లమెంటును నడవనివ్వమన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకునే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం కాయమని ధీమా వ్యక్తం చేశారు. అనేక మంది మహానుభావుల్ని ప్రజలు చనిపోయిన తరువాత కూడా గుర్తు పెట్టుకున్నారని, కానీ చంద్రబాబును మాత్రం బతికుండగానే మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరులో గల్లా జయదేవ్ రౌడీయిజం చేశారని ఆరోపించారు. జిల్లాను లూటీ చేసిన ప్రజాప్రతినిధుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెందిన గల్లాను నమ్ముకుంటే.... జగన్‌ గుంటూరు ప్రజలను నమ్ముకున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement