తొలి రోజు నామినేషన్లు వేసింది వీరే | First Day Nomination Time Closed In Telangana | Sakshi
Sakshi News home page

Nov 12 2018 9:05 PM | Updated on Mar 18 2019 9:02 PM

First Day Nomination Time Closed In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో తొలిరోజు నామినేషన్ల గడువు ముగిసింది. మొదటి రోజు మొత్తం 48 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా టీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది నామినేషన్లు వేశారు. బీజేపీ-9, కాంగ్రెస్‌-6, టీడీపీ-2, సీపీఐ(ఎం)-2, సీపీఎం-1, బీఎల్‌ఎప్‌ -2, బీఎస్పీ-1, ఆప్‌-2, పీపీఐ-2, స్వతంత్రులు -11 మంది తొలిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి లక్ష్మణ్‌( ముషీరాబాద్), రాజాసింగ్‌( గోషామాల్‌), రఘునందన్‌ రావు(దుబ్బాక)లు తొలి రోజు నామినేషన్‌ వేశారు. ధర్మపురి టీఆర్‌ఎస్‌ అభ్యర్తిగా కొప్పుల ఈశ్వర్‌, మంథని అభ్యర్థిగా పుట్టా మధుకర్‌ నామినేషన్లు దాఖలు చేశారు. పుట్టమధుకర్‌ తరపున ఆయన సతీమణి శైలజ నామినేషన్‌ వేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement