వైఎస్‌ జగన్‌పై దాడి పిరికిపంద చర్య | YSRCP Australia Wing Condemns Attack On YS Jagan | Sakshi
Sakshi News home page

Oct 25 2018 9:06 PM | Updated on Oct 25 2018 9:52 PM

YSRCP Australia Wing Condemns Attack On YS Jagan - Sakshi

కాన్‌బెర్రా : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌​ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఆ పార్టీ ఆస్ట్రేలియా విభాగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా సోషల్‌ మీడియా ఇంచార్జ్‌ రమ్య యార్లగడ్డ, రాజేశ్‌ సక్కమురి, వైఎస్‌ఎన్‌ ప్రసాద్‌, కౌషిక్‌ మామిడి, ధనుష్‌, శరణ్‌ అన్నారు. ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్‌ జగన్‌కు భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement