భర్తను చంపి బాత్ రూంలో పాతేసి జైలుపాలు | Woman gets life term for killing, burying husband in bathroom | Sakshi
Sakshi News home page

భర్తను చంపి బాత్ రూంలో పాతేసి జైలుపాలు

Jul 7 2015 2:57 PM | Updated on Jul 30 2018 8:29 PM

భర్తను చంపి బాత్ రూంలో పాతేసి జైలుపాలు - Sakshi

భర్తను చంపి బాత్ రూంలో పాతేసి జైలుపాలు

సినిమా పక్కీలో కట్టుకున్న భర్తను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూంలోనే పాతి పెట్టిన ఓ భార్యకు కోర్టు జీవిత కారాగార శిక్షను విధించింది

మీరట్: సినిమా పక్కీలో కట్టుకున్న భర్తను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూంలోనే పాతి పెట్టిన ఓ భార్యకు కోర్టు జీవిత కారాగార శిక్షను విధించింది. దీంతోపాటు రూ.25 వేల జరిమాన కూడా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం మీరట్లోని గంగా నగర్కు చెందిన రాజేంద్రపటేల్, వర్షా అనే ఇద్దరు భార్య భర్తలు. రాజేంద్ర పటేల్ ఆర్మీ జవానుగా పనిచేస్తుండగా ఆమె ఇంట్లోనే ఉంటుంది. 2012 మార్చి 24న రాజేంద్ర పటేల్కు వర్ష నిద్ర మాత్రలు వేసి అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసింది.

అనంతరం అతడిని ఈడ్చుకెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బాత్రూంలో పాతిపెట్టి పైన బండలు వేసి ప్లాసింగ్ కూడా చేయించింది. ఆ తర్వాత ఇల్లును మంజు అనే మరో మహిళకు అమ్మేసింది. దీంతో వారు మార్చి 27న గృహ ప్రవేశం చేయగా వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు తెలిసింది. అక్కడ తవ్వకాలు జరపడంతో రాజేంద్ర కుమార్ మృతదేహం బయటపడింది. దీంతో అదే రోజు వర్షాను పోలీసులు అరెస్టు చేశారు. చివరికి మంగళవారం జిల్లా కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement