సుశాంత్ మ‌ర‌ణం: మ‌రో అభిమాని ఆత్మ‌హ‌త్య‌ | Sushant Singh Rajput Fan Ends Life In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో సుశాంత్ అభిమాని ఆత్మ‌హ‌త్య‌

Jun 22 2020 4:33 PM | Updated on Jun 22 2020 4:49 PM

Sushant Singh Rajput Fan Ends Life In Uttar Pradesh - Sakshi

ల‌క్నో: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక లేడ‌‌న్న వార్త‌ను ఆయ‌న అభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌ను త‌ట్టుకోలేక ఇప్ప‌టికే ప‌లువురు అభిమానులు ప్రాణాలు విడిచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఉత్త‌ర ప్రదేశ్‌కు చెందిన మ‌రో అభిమాని శ‌నివారం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ విష‌యం ఆల‌స్యంగా తెలిసింది. గ్రేట‌ర్ నోయిడాకు చెందిన పన్నెండేళ్ల బాలుడు ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య అత‌న్ని తీవ్రంగా కుంగ‌దీసింది. (సుశాంత్‌ ఆత్మహత్య: పీఎస్‌కు హీరోయిన్‌)

దీంతో మ‌నోవేద‌న‌కు గురైన బాలుడు శ‌నివారం త‌న గ‌దిలోకి వెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సుశాంత్ ఎలాగైతే చ‌నిపోయాడో అలాగే ఆ బాలుడు కూడా ఉరివేసుకుని మ‌ర‌ణించాడు. కాగా అత‌డు గ‌దిలోకి వెళ్ల‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు టీవీలో సుశాంత్‌కు సంబంధించిన వార్త‌లే చూశాడ‌ని బాలుడి కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. జూన్ 14న‌ సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. అత‌డి మ‌ర‌ణ‌వార్త‌ను త‌ట్టుకోలేక‌ విశాఖ‌ప‌ట్నంకు చెందిన ఓ అమ్మాయి, ఒడిశాకు చెందిన ఓ బాలిక‌ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. (సుషాంత్‌ మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య)

Advertisement
 
Advertisement
Advertisement