breaking news
Fan commits suicide
-
సుశాంత్ మరణం: మరో అభిమాని ఆత్మహత్య
లక్నో: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక లేడన్న వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యను తట్టుకోలేక ఇప్పటికే పలువురు అభిమానులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో అభిమాని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా తెలిసింది. గ్రేటర్ నోయిడాకు చెందిన పన్నెండేళ్ల బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. సుశాంత్ ఆత్మహత్య అతన్ని తీవ్రంగా కుంగదీసింది. (సుశాంత్ ఆత్మహత్య: పీఎస్‌కు హీరోయిన్) దీంతో మనోవేదనకు గురైన బాలుడు శనివారం తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ ఎలాగైతే చనిపోయాడో అలాగే ఆ బాలుడు కూడా ఉరివేసుకుని మరణించాడు. కాగా అతడు గదిలోకి వెళ్లడానికి కొన్ని క్షణాల ముందు టీవీలో సుశాంత్‌కు సంబంధించిన వార్తలే చూశాడని బాలుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. అతడి మరణవార్తను తట్టుకోలేక విశాఖపట్నంకు చెందిన ఓ అమ్మాయి, ఒడిశాకు చెందిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. (సుషాంత్ మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య) -
జట్టు ఓటమి తట్టుకోలేక అభిమాని ఆత్మహత్య
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ టోర్ని లో తన ఫేవరేట్ జట్టు ఓటమిపాలవ్వడాన్ని జీర్ణించుకోలేక ఏడంతస్థుల భవనం నుంచి దూకి చనిపోయిన సంఘటన కెన్యా రాజధాని నైరోబిలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఓల్డ్ ట్రాఫోర్డ్ లో న్యూకాజిల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 1-0 తేడాతో ఓటమి పాలైంది. మ్యాగ్ పైస్, మాంచెస్టర్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన వెంటనే జాన్ మచారియా అనే అభిమాని నైరోబిలోని పైప్ లైన్ ఎస్టేట్ లోని అపార్ట్ మెంట్ లోని ఏడవ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు అని నైరోబీ కౌంటీ పోలీసులు తెలిపారు. గతంలో కూడా తమ ఫేవరెట్ జట్ట ఓటిమి పాలుకావడంతో పలువురు అభిమానులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2009 లో జరిగిన యూఈఎఫ్ఏ చాంఫియన్స్ లీగ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ది గన్నర్ జట్టు ఓటమి పాలవ్వడంతో సులేమాన్ ఆల్ఫాన్సో ఓమోండి అనే అభిమాని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.