సుశాంత్‌ ఆత్మహత్య: పీఎస్‌కు హీరోయిన్‌ | Sushant Suicide Case: Bandra Police TAkes Statements OF Rhea | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ ఆత్మహత్య: పీఎస్‌కు హీరోయిన్‌

Jun 18 2020 12:22 PM | Updated on Jun 18 2020 12:37 PM

Sushant Suicide Case: Bandra Police TAkes Statements OF Rhea - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు సంబంధించిన ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుశాంత్‌ సన్నిహితులను, బంధువులు, ఇంటి పనివాళ్లను విచారించి వారి నుంచి వాంగూల్మాన్ని తీసుకున్నారు. తాజాగా సుశాంత్‌ ప్రేయసి, హీరోయిన్‌ రియా చక్రవర్తిని పోలీసులు గురువారం విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం బాంద్రా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన రియాను విచారించి ఆమె నుంచి వాంగూల్మాన్ని తీసుకోనున్నారు. (సుశాంత్‌కి తొలి అవ‌కాశం ఇచ్చింది నేనే)

గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు స్నేహితుడు మహేశ్‌ శెట్టి, ప్రేయసి రియా చక్రవర్తితో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే మహేశ్‌ను పోలీసులు విచారించిగా ఈరోజు రియా నుంచి వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. ఇక సుశాంత్‌-రియాలు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. (ఆ డైరెక్టర్‌ వల్లే డిప్రెషన్‌లోకి వెళ్లాను‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement