రామలక్ష్మి పాత్ర ఛాలెంజ్‌గా తీసుకున్నా | special chit chat with heroine samantha | Sakshi
Sakshi News home page

రామలక్ష్మి పాత్ర ఛాలెంజ్‌గా తీసుకున్నా

Apr 11 2018 12:34 AM | Updated on Apr 11 2018 9:27 AM

special chit chat with heroine samantha - Sakshi

‘‘నటిగా నేను చాలా దూరం ప్రయాణించి నాకంటూ ఓ దారి ఏర్పరచుకున్నా. ఇప్పుడు అర్థం పర్థం లేని పాత్రలు చేస్తే ఉపయోగం ఉండదు. నా పాత్రకి ప్రాముఖ్యత ఉండే సినిమాలే ఒప్పుకుంటున్నా.  అందుకే.. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో ఇక నేను కనిపించకపోవచ్చు. ఈ నిర్ణయం నటిగా తీసుకున్నదే తప్ప పెళ్లి తర్వాత వచ్చిన మార్పు కాదు’’ అని సమంత పేర్కొన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్‌) నిర్మించిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదలయింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ... 

నాకు రిస్క్‌లంటే చాలా ఇష్టం. నా కెరీర్‌ అంతా రిస్క్‌లతోనే గడిచింది. ఛాలెంజ్‌ అంటే భయం ఉన్నా చేయాలని ఉంటుంది. రామలక్ష్మి పాత్రకి కాస్త భయపడ్డా.. భిన్నమైన పాత్ర అని చేశా ∙ఐదేళ్ల క్రితం ‘రంగస్థలం’ వచ్చి ఉంటే ఇంత మంచి అభినందనలు వచ్చేవి కాదేమో?. ప్రేక్షకుల మైండ్‌సెట్‌ మారింది. నా కెరీర్‌లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ మూవీగా ‘రంగస్థలం’ నిలిచినందుకు హ్యాపీ ∙‘ఏమాయ చేసావె’ లో జెస్సీ, ‘ఈగ’లో బిందు, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ లోనూ మంచి పాత్రలు చేశా.

అయితే.. రామలక్ష్మి డిఫరెంట్‌ పాత్ర. ఛాలెంజ్‌గా తీసుకుని వందశాతం ఎఫర్ట్‌ పెట్టి చేశా. ∙‘రంగస్థలం’ ఫస్ట్‌ లుక్‌లో నా ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూడగానే షాకయ్యి ‘ఏయ్‌ ఏంటిది?’ అన్నాడు. నేనెప్పుడూ గర్వంగా ఫీలవ్వలేదు. కానీ, ‘రంగస్థలం’ లో భాగమైనందుకు గర్వంగా అనిపించింది. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందనుకోలేదు ∙చరణ్‌ లవ్‌లీ కోస్టార్‌. ఇంతకు ముందు నా సినిమాలు రిలీజవుతున్నాయంటే ఎవర్నీ నిద్రపోనిచ్చే దాన్ని కాదు. ఇప్పుడలా కాదు. ‘వందశాతం నీ పాత్రకు న్యాయం చెయ్‌.. తర్వాత మరచిపో. ఆడియన్స్‌ ఫీలింగ్‌ని మనం కంట్రోల్‌ చేయలేం’ అనే విషయం చైతన్య నుంచి నేర్చుకున్నా ∙పెళ్లైన హీరోయిన్ల సినిమాలను ప్రేక్షకులు చూడరనేది ఫిలిం మేకర్స్‌ ఆలోచన. ప్రేక్షకులు ఆ మాట చెప్పలేదు. నా పాత్రను ప్రేక్షకులు అంగీకరించారంటే ఫిలిం మేకర్స్‌కి మెసేజ్‌ ఇచ్చినట్టే కదా?. నాకు నా కుటుంబాలే(అక్కినేని, దగ్గుబాటి) పెద్ద బలం. ప్రస్తుతం ‘యూ టర్న్‌’ మూవీ చేస్తున్నా. 

Advertisement
 
Advertisement
Advertisement