ఆ ఆరుగురికి కరోనా పాజిటివ్‌ | Six Went To Salon In MP Test Corona Positive | Sakshi
Sakshi News home page

హెయిర్‌ కట్‌కు వెళ్లి కరోనా తెచ్చుకున్నారు

Apr 26 2020 2:14 PM | Updated on Apr 26 2020 2:34 PM

Six Went To Salon In MP Test Corona Positive - Sakshi

భోపాల్‌ : కరోనా వైరస్‌ సోకకుండా లాక్‌డౌన్‌ను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తుప్పటికీ  కొందరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అనవసరమైన పనులకు బయటకు వెళ్లి కరోనా బారిన పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సెలూన్‌కు వెళ్లిన ఆరుగురు యువకులకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. స్థానిక వైద్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇండోర్‌ నుంచి స్థానికంగా ఉన్న సెలూన్‌లో హెయిర్‌ కట్‌‌ చేయించుకున్నాడు. అనంతరం రెండు రోజుల తరువాత అతనికి తీవ్ర అనారోగ్య సమస్య రావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే అదే వారంలో మరో ఆరుగురు వ్యక్తులు అదే షాపులో కటింగ్‌ చేయించుకున్నారు. దీంతో వారందరికి తాజాగా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా పాజిటివ్‌ అని తేలింది. దీంతో  ఆ యువకులను క్వారెంటైన్‌కు తరలించాగా.. ఆ గ్రామంలోని అందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఆరుగురు మృ‍త్యువాత పడ్డట్లు జిల్లా అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement