'ఏపీ తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వండి' | seetharam yechuri demands special status for ap, telangana | Sakshi
Sakshi News home page

'ఏపీ తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వండి'

May 17 2015 5:18 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పునర్విభజన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. సంవత్సరకాలంలో మోదీ 18 దేశాలకు వెళ్లారని, గతంలో ఏ ప్రధాని ఏడాదిలో ఇన్ని దేశాలకు వెళ్లలేదని ఏచూరి చెప్పారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ సిఫారసులతో గవర్నర్లను నియమిస్తున్నారని ఏచూరి ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement