‘మోదీ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌’ | Salman Khurshid Says Countdown For Modi Government Has Already Begun | Sakshi
Sakshi News home page

‘మోదీ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌’

May 7 2019 12:09 PM | Updated on May 7 2019 2:16 PM

Salman Khurshid Says Countdown For Modi Government Has Already Begun - Sakshi

‘మోదీ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌’

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వ ఐదేళ్ల ప్రజాకంటక పాలనకు తెరపడుతోందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ జోస్యం చెప్పారు. దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖుర్షీద్‌ తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని, ఐదేళ్ల అరాచకపాలన ముగియనుందని వ్యాఖ్యానించారు. మరో 16 రోజుల్లో మోదీ పాలనకు తెరపడుతుందని, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని నెంబర్‌వన్‌ అవినీతిపరుడిగా మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సహా పలువురు విపక్ష నేతలు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నడో మరణించిన రాజీవ్‌ గాంధీని ప్రధాని మోదీ నిందించడం అమానవీయమని విపక్ష నేతలు ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement