మహిళా కబడ్డీ జట్టుకు మోడీ అభినందనలు | Narendra Modi congratulates Indian women's kabaddi team | Sakshi
Sakshi News home page

మహిళా కబడ్డీ జట్టుకు మోడీ అభినందనలు

Oct 3 2014 1:31 PM | Updated on Aug 21 2018 9:33 PM

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా కబడ్జీ జట్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

న్యూఢిల్లీ : ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా కబడ్జీ జట్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. 'పసిడి పతకం గెలుచుకున్న జట్టును అభినందిస్తున్నా.ఇది అసాధారణ విజయం' అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత మహిళల కబడ్డీ జట్టు దేశం గర్వపడేలా చేసిందని మోడీ అన్నారు. కబడ్డీలో మహిళలు జట్టు ఫైనల్స్లో ఇరాన్పై 31-21 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు పురుషుల కబడ్డీ జట్టు కూడా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ భారత్ 11 పసిడి పతకాలను సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement