‘పద్మ’ ఇవ్వాలని శరద్ యాదవ్ సిఫార్సు | Mulayam Yadav's push speeds up Janata Parivar merger | Sakshi
Sakshi News home page

‘పద్మ’ ఇవ్వాలని శరద్ యాదవ్ సిఫార్సు

Apr 13 2015 1:06 AM | Updated on Sep 3 2017 12:13 AM

‘పద్మ’ ఇవ్వాలని శరద్ యాదవ్ సిఫార్సు

‘పద్మ’ ఇవ్వాలని శరద్ యాదవ్ సిఫార్సు

నిజాయితీ లేని వారికే పద్మ అవార్డులు ఇస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేడీయూ చీఫ్ శరద్ యాదవ్..

న్యూఢిల్లీ: నిజాయితీ లేని వారికే పద్మ అవార్డులు ఇస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేడీయూ చీఫ్ శరద్ యాదవ్.. గతంలో స్వయంగా ఓ డాక్టర్‌కు ఆ అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. 2014లో యాదవ్ లోక్‌సభ ఎంపీగా ఉన్నప్పుడు గుర్గావ్‌కు చెందిన బలరాజ్‌సింగ్ యాదవ్ అనే వైద్యుడికి ఈ పురస్కారం ఇవ్వాలని సిఫార్సు చేశారని హోం శాఖ డాక్యుమెంట్‌లో ఉంది. దీనిపై యాదవ్ స్పందిస్తూ.. తాను సిఫార్సు చేసి ఉండొచ్చని, తన వ్యాఖ్యలకు, దీనికి మధ్య వైరుధ్యం లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. పద్మ అవార్డు విజేతల ఎంపిక ప్రక్రియలో నిజాయితీ లేదని తాను అన్నానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement