భార్య దూరమైందని భర్త ఆత్మహత్య | man commits suicide in tamilnadu | Sakshi
Sakshi News home page

భార్య దూరమైందని భర్త ఆత్మహత్య

Dec 23 2017 6:33 PM | Updated on Aug 29 2018 8:38 PM

man commits suicide in tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: భార్య తన నుంచి విడిపోయిందని మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తంజావూరు అన్నానగర్‌ ప్రాంతానికి చెందిన గిరి(35) మాణంబచ్చావడి చిన్న ఆసుపత్రి సమీపంలో వెల్డింగ్‌ వర్కుషాపు నడుపుతున్నాడు. ఇతని భార్య సుధ. వీరికి వివాహం జరిగి 10 ఏళ్లవుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల కారణంగా సుధ భర్త నుంచి వీడిపోయి పుట్టింటికి వెళ్లింది. 

ఒంటరిగా నివసిస్తూ వచ్చిన గిరికి అప్పుల సమస్యలు తోడయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన గిరి వెల్డింగ్‌ వర్కుషాపులో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తంజావూరు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గిరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement