పెట్రోలు : మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం | Madhya Pradesh govt revises the price of petrol and diesel in stat | Sakshi
Sakshi News home page

పెట్రోలు : మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం

Jun 13 2020 10:02 AM | Updated on Jun 13 2020 11:02 AM

Madhya Pradesh govt revises the price of petrol and diesel in stat - Sakshi

భోపాల్: ఒక వైపు ప్రభుత్వరంగ చమురు సంస్థలు వరుసగా ఇంధన ధరలు పెంచుతోంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు సిద్ధమైంది. పెట్రోలు, డీజిల్ ధరలపై అదనంగా కరోనా  పన్ను విధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.  పెట్రోలు, డీజిల్ పై ఒక రూపాయి చొప్పున కరోనా టాక్స్ విధించింది. ఈ ధరలు నేడు (జూన్ 13)  నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. తాజా పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటరుకు రూ .82.64, డీజిల్ ధర రూ .73.14 కు చేరింది. (ఆగని పరుగు : పెట్రో సెగ)

Advertisement
 
Advertisement
Advertisement