ఆగని పరుగు : పెట్రో సెగ | Petrol and diesel prices hike | Sakshi
Sakshi News home page

ఆగని పరుగు : పెట్రో సెగ

Jun 13 2020 8:24 AM | Updated on Jun 13 2020 8:52 AM

Petrol and diesel prices hike - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు ధరలు వరుసగా 7వ రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం కూడా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ ధరను లీటరుకు 58 పైసలు, డీజిల్ ధరను 59 పైసలు చొప్పున పెంచాయి. తాజా పెంపుతో  ఏడు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు  రూ. 3.90, డీజిల్ ధర లీటరుకు  రూ. 4.01 ఎగిసింది. 
 
ప్రధాన నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు
ఢిల్లీ : పెట్రోల్  రూ. 75.16, డీజిల్ రూ. 73.39
ముంబై: పెట్రోల్  రూ. 82.10, డీజిల్ రూ.72.03
చెన్నై: పెట్రోల్ రూ. 78.99, డీజిల్ రూ. 71.64
బెంగళూరు: పెట్రోల్ రూ.77.59, డీజిల్ రూ. 69.78

హైదరాబాద్: పెట్రోల్ రూ.78.03, డీజిల్ రూ. 71.73
అమరావతి : పెట్రోల్ రూ.78.53, డీజిల్ రూ.72.28

Advertisement
 
Advertisement
Advertisement