సిబ్బందిపై నౌకాదళం కీలక నిర్ణయం

Indian Navy Ban Social Networking Platforms Within Naval Area - Sakshi

న్యూఢిల్లీ: భారత నౌకాదళం తన సిబ్బందికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేవి సిబ్బంది సోషల్‌ మాధ్యమాలు అయిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లు వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. భారత నౌకాదళానికి చెందిన బోర్డు నౌకలు, వైమానిక స్థావరాల్లో సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లను కూడా అనుమంచమని ఓ ప్రకటనలో భారత నైకాదళం పేర్కొంది.

ఇటీవల భారత నౌకాదళంలో హనీ ట్రాప్‌లో చికుకున్న ఏడుగురు నేవీ సెయిలర్స్‌ నౌకాదళ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారిని విశాఖపట్నం పోలీసు ఆరెస్ట్‌ చేసి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ముంబైకి చెందిన ఒక హవాలా ఏజెంట్‌ కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో భారత నేవి  సోషల్‌ మాధ్యమాలను సిబ్బంది ఉపయోగించటంపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలతో పలు భద్రత సమస్యలు రావటంతో భారత నేవి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా భారత నౌకాదళం కూడా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాలను ఉపమోగిస్తుంది. కానీ.. వాటిలో నౌకాదళం సాధించిన విజయాలు, విపత్తుల సమయంలో అందించిన మానవ సహాయం, సంబంధిత విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం పలు నోటిఫికేషన్లకు చెందిన ప్రకటనలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: భారత నావికులకు వలపు వల

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top