గుజరాత్‌లో భూకంపం | Earthquake Termors Felt in Hanjiyasar Gujarat | Sakshi
Sakshi News home page

Mar 29 2018 7:54 AM | Updated on Mar 29 2018 5:19 PM

Earthquake Termors Felt in Hanjiyasar Gujarat - Sakshi

అహ్మదాబాద్‌ : భూకంపంతో గుజరాత్‌ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గురువారం వేకువ ఝామున స్వల్ఫ ప్రకంపనలు సంభవించాయి. రాజ్‌కోట్‌ జిల్లా హంజియసర్‌ ప్రాంతంలో ఉదయం 4గం.3ని. సమయంలో భూమి స్వల్ఫంగా కంపించింది.

రిక్చర్‌ స్కేల్‌పై 4.6 తీవ్రత నెలకొంది. ప్రజలంతా భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement