25న దేశీయ విమాన సర్వీసులు షురూ | Domestic Flights To Resume Soon | Sakshi
Sakshi News home page

25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

May 20 2020 5:23 PM | Updated on May 20 2020 6:17 PM

Domestic Flights To Resume Soon - Sakshi

ఈనెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ విమాన సర్వీసులు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కట్టడికి మార్చి 25న దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవనున్నాయి. మే 25 సోమవారం నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణకు సిద్ధంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్‌కు సమాచారం అందించామని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ పూరి ట్వీట్‌ చేశారు.

ఇక విమాన ప్రయాణీకులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలు, మార్గదర్శకాలను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుందని ట్వీట్‌లో తెలిపారు. విమానాల్లో తక్కువ సీట్లను అమర్చడంతో పాటు మధ్య సీటును ఖాళీగా ఉంచడం ద్వారా ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా పలు చర్యలు చేపడతారు.

చదవండి : విదేశాల నుంచి భారత్‌కు విమానాల రాక

Advertisement
 
Advertisement
Advertisement