ఆ దేశాల నుంచి భారత్‌కు రానున్న విమానాలు

Vande Bharat Mission: For Phase 1, Air India is Operating 64 Flights to and from 12 Countries - Sakshi

ఎన్‌ఆర్‌ఐ: కరోనా కారణంగా ప్రపంచం ఎన్నడూ ఎదుర్కొని సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. ఈ మహమ్మారి పేద, ధనిక, సామాన్యులు, గొప్పవారు అని సంబంధం లేకుండా అందరి జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. కేవలం వృతిపరంగా మాత్రమే ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను కూడా ఈ కరోనా వైరస్‌ చిన్నాభిన్నం చేసింది. ఈ మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకట్టవేసేందుకు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. భారత ప్రభుత్వం కూడా మార్చి 21 న లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్‌డౌన్‌ను ఇప్పటికీ మూడు సార్లు సవరించి మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి భారతదేశానికి సంబంధించి అన్ని విదేశీ ప్రయాణాలతో పాటు దేశం లోపల కూడా అన్ని రవాణా సౌకర్యాలు రద్దు అయ్యాయి. దీంతో ఉద్యోగరీత్యా, చదువు కోసం, ఇంట్నషిప్‌ కోసం, టూర్‌ కోసం, బిజినెస్‌ పని మీద ఇతర దేశాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే పరిస్థితులు లేక అక్కడే చిక్కుకొని పోయారు. వారందరూ ఎప్పుడెప్పుడు మన దేశానికి తిరిగొద్దామా అని ఎదురు చూస్తున్నారు.  స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కల్పించాలని వారు భారత ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో కరోనా కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులందరిని వెనక్కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టింది.

వందేమాతరం మిషన్‌ అలాగే ఆపరేషన్‌ సముద్రసేతు ద్వారా భారతీయులందరిని స్వదేశానికి చేర్చడానికి నిర్ణయించి అందుకు సంబంధించిన కార్యకలాపాలు మొదలుపెట్టారు. అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో విదేశీ మంత్రిత్వ శాఖ ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన కోవిడ్‌-19 సెల్‌ విభాగం ఈ ఆపరేషన్లను దగ్గరుండి పరిశీలిస్తోంది. వివిధ దేశాలలో ఉన్న భారత ఎంబాసీలు, హైకమిషన్ల ద్వారా అక్కడ వారి వివరాలు తెలుసుకొని వారిని భారతదేశానికి తీసుకు వస్తున్నారు. వందే భారత్‌ మిషన్‌ తొలి విడతలో ఎయిర్‌ ఇండియా 12 దేశాలకు 64 విమాన సర్వీసులు అందిచనుంది. మే 7 నుంచి 15 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఆపరేషన్‌ ద్వారా విదేశాలలో చిక్కుకుపోయిన వారిని తరలించనున్నారు. వందేభారత్‌ మిషన్‌ ద్వారా 7 విమానాలు అమెరికా నుంచి ఇండియాకు రానున్నాయి. ( టిక్కెట్లన్నీ రద్దు: రైల్వే శాఖ)

వీటిలో రెండు విమానాలు ఒక్కొక్కటి  శాన్‌ఫ్రాన్సికో నుంచి, న్యూయార్క్‌ నుంచి, చికాగో, వాషింగ్టన్‌ నుంచి రానున్నాయి. చికాగో నుంచి వచ్చే విమానం ముంబాయ్‌,  చెన్నైకి రానుంది. మే15 న బయలుదేరనున్న విమానం ఢిల్లీ, హైదరాబాద్‌ చేరుకోనుంది. అయితే ఈ ఏడు విమానాల్లో ఉన్న సీట్లు ఎంబాసీ పోర్టల్‌లో రిక్వెస్ట్‌ పెట్టుకున్న అందరకి సరిపోయేంతా లేవు.  దీంతో అందరికి మొదటిఫేస్‌లో విమాన సీట్లు కేటాయించలేమని ఈ విషయంలో అందరూ ఓపికతో ఉండాలని స్వదేశీ మీడియా, యూఎస్‌ఏ ద్వారా  విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధి భారత ప్రభుత్వం ఫేస్‌-2 ని కూడా ప్లాన్‌చేస్తోందని మరికొంతమందిని ఆ విమానాల ద్వారా తరలిస్తామని పేర్కొంది. భారతదేశానికి తీసుకువచ్చే విషయంలో ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి, విద్యార్థులకు, పెద్దవాళ్లకి, గర్భవతులకు, వీసా గడువు ముగిసిన వారికి మొదట ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మిగిలిన వారిని ఎలక్ట్రానిక్ ర్యాండమ్‌ సెలక్షన్‌లో ఎంపిక చేస్తారు. ప్రయాణీకులందరికీ ఈ మెయిల్స్‌, ఫోన్ల ద్వారా పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్‌, టికెట్‌ ప్రాసెస్‌, హెల్త్‌ ప్రోటోకాల్‌, బయలు దేరే సమయాలు అన్నింటి గురించి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు.

(దూరం 250 కిమీ.. టికెట్ ధర 12వేలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top