కుంభకోణాలపై నిఘాకు బీజేపీలో కమిటీ | delhi bjp forms four members committe for watch scams | Sakshi
Sakshi News home page

కుంభకోణాలపై నిఘాకు బీజేపీలో కమిటీ

Sep 15 2013 10:38 PM | Updated on Mar 29 2019 9:18 PM

షీలా ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపడానికి రాష్ట్ర బీజేపీ నలుగురు సభ్యులతో ప్రత్యేకంగా ‘అభియోగాల కమిటీ’ని నియమించింది.

న్యూఢిల్లీ: షీలా ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపడానికి రాష్ట్ర బీజేపీ నలుగురు సభ్యులతో ప్రత్యేకంగా ‘అభియోగాల కమిటీ’ని నియమించింది. ‘ప్రభుత్వం అక్రమాలను ప్రజల దృష్టికి తేవడానికి ఇది కృషి చేస్తుంది’ అని కమిటీ సభ్యురాలు, పార్టీ ప్రతినిధి మీనాక్షి లేఖీ తెలిపారు. ఎమ్మెల్యేలు రవీందర్ బన్సాల్, జైభగవాల్ అగర్వాల్, సాహిబ్‌సింగ్ చౌహాన్ ఇందులో సభ్యులుగా వ్యవహరిస్తారు.
 
 

యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలను ప్రజలకు వివరించడానికి బీజేపీ జాతీయస్థాయిలోనూ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సంస్థలు, మేధావులు, కేంద్ర నాయకులతో సంప్రదింపులు జరపడం, ఎన్నికల ప్రచార నిర్వహణ కోసం కూడా మరో 19 కమిటీలు ఏర్పాటు చేయాలని ఢిల్లీ బీజేపీ నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement