లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ | Congress Party Announced Candidates For 15 Loksabha Seats In Gujarat And Utter Pradesh | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

Mar 7 2019 9:45 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Party Announced Candidates For 15 Loksabha Seats In Gujarat And Utter Pradesh - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే లోక్‌సభస్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల వేడిని రాజేసింది కాంగ్రెస్‌ పార్టీ. ఎన్నికల నోటిఫికేషన్‌ రెండు మూడు రోజుల్లో వెలువడనుందన్న వార్తల నేపథ్యంలో లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన మరింత హీట్‌ను పెంచింది. మొదటి విడతగా గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ పేర్లు విడుదల చేసింది. గుజరాత్‌లో 4 , ఉత్తర్‌ ప్రదేశ్‌లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ముకుల్‌ వాస్నిక్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా

సంఖ్య రాష్ట్రం నియోజకవర్గం  అభ్యర్థి పేరు
1 గుజరాత్‌ అహ్మదాబాద్‌ వెస్ట్‌(ఎస్సీ) రాజు పర్మార్‌
2 గుజరాత్‌ ఆనంద్‌  భరత్‌సింగ్‌ సోలంకి
3 గుజరాత్‌ వడోదరా ప్రశాంత్‌ పటేల్‌
4 గుజరాత్‌ చోటా ఉదయ్‌పూర్‌(ఎస్టీ) రంజిత్‌ మోహన్‌సింగ్‌ రత్వా
5 ఉత్తర్‌ ప్రదేశ్‌ సహారాన్‌పూర్‌ ఇమ్రాన్‌ మసూద్‌
6 ఉత్తర్‌ ప్రదేశ్‌ బదౌన్‌ సలీమ్‌ ఇక్బాల్‌ షేర్వాణీ
7 ఉత్తర్‌ ప్రదేశ్‌ ధౌరాహ్రా జితిన్‌ ప్రసాద్‌
8 ఉత్తర్‌ ప్రదేశ్‌ ఉన్నావ్‌ అన్ను టాండన్‌
9 ఉత్తర్‌ ప్రదేశ్‌ రాయబరేలి సోనియా గాంధీ
10 ఉత్తర్‌ ప్రదేశ్‌ అమేథి రాహుల్‌ గాంధీ
11 ఉత్తర్‌ ప్రదేశ్‌ ఫరూకాబాద్‌ సల్మాన్‌ ఖుర్షీద్‌
12 ఉత్తర్‌ ప్రదేశ్‌ అక్బర్‌పూర్‌ రాజారాం పాల్‌
13 ఉత్తర్‌ ప్రదేశ్‌ జలౌన్‌(ఎస్సీ) బ్రిజ్‌లాల్‌ ఖబ్రి
14 ఉత్తర్‌ ప్రదేశ్‌ ఫైజాబాద్‌ నిర్మల్‌ ఖత్రి
15 ఉత్తర్‌ ప్రదేశ్‌ ఖుషీనగర్‌ ఆర్‌పీఎన్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement