బియాస్ లో మరో మృతదేహం వెలికితీత | another dead body found in Himachal tragedy | Sakshi
Sakshi News home page

బియాస్ లో మరో మృతదేహం వెలికితీత

Jun 13 2014 4:56 PM | Updated on Jun 4 2019 6:34 PM

హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరో మృతదేహం వెలికితీశారు. బియాస్ నదిలో అలోజీమాతా మందిర్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు.

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరో మృతదేహం వెలికితీశారు. బియాస్ నదిలో అలోజీమాతా మందిర్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహం ఎవరిదన్నది కాసేపట్లో గుర్తించనున్నారు.  

విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది ఆదివారం సాయంత్రం బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తొమ్మది మృతదేహాలను గుర్తించారు. ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలను హైదరాబాద్ తరలించారు. మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement